అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో 13మందిపై కేసులు నమోదు చేసినట్లు ఐజీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట చేసిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ తాగిన మైకంలోనే నిందితులు విగ్రహాలను ధ్వంసం చేశారని తెలిపారు.
విగ్రహాల ధ్వంసం కేసులో ముగ్గురి అరెస్ట్
- Saturday, 28 January 2012 12:01
తెలుగు వారియర్స్ vs కేరళ స్ట్రైకర్స్
- Saturday, 28 January 2012 11:02
ఆస్ట్రేలియాలో భారత పరాజయాలను చూడలేక పోతున్న అభిమానులకు ఊరట. తారల క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాసేపు సంతోషంగా గడిపే అవకాశం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో విక్టరీ వెంకటేశ్ సారధ్యంలోని తెలుగు వారియర్స్ మూడో లీగ్ పోరుకు సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తో తెలుగు వారియర్స్ తలపడనుంది.
మణిపూర్ లో ప్రారంభమైన పోలింగ్
- Saturday, 28 January 2012 10:52
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మణిపూర్‌లో ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. మొత్తం 60 స్థానాలకు 279 మంది పోటీ పడ్తున్నారు. ఉగ్రవాదుల దాడుల నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటూ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, మణిపూర్ పీపుల్స్ పార్టీలు ఎన్నికలలో పాల్గొంటున్నాయి.
లాంచనం ముగిసింది : భారత్ పరాజయం పరిపూర్ణం
- Saturday, 28 January 2012 10:22
ఆస్ట్రేలియాలో భారత్ పరాజయం పరిపూర్ణమయింది. వల్డ్ ఫేమస్ ఇండియా బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. ఫలితంగా అడిలైడ్ టెస్ట్‌లో భారత్ 201 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 298 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లయాన్ 4, హారిస్ 3 వికెట్లు పడగొట్టారు. సిడిల్ కు 'మాన్ అఫ్ ది మ్యాచ్' లభించింది.
సీఎం అయ్యాక తొలి సంతకం వ్యాట్ పైనే : జగన్
- Saturday, 28 January 2012 10:06
తాను ముఖ్యమంత్రిని అయితే వ్యాట్(విలువ ఆధారిత పన్ను) రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో వ్యాట్ పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు పొందేందుకే కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. వారికి ప్రజల దుస్థితి పట్టడం లేదన్నారు. వ్యాట్ పెంపు వల్ల ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.1400 పడుతుందన్నారు.
ఈ ఏడాదిలోనే చరణ్ నిశ్చితార్థం : చిరంజీవి
- Saturday, 13 August 2011 12:32
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ నిశ్చితార్థం ఈ ఏడాదిలోపే జరగనుంది. ఈరోజు చరణ్ తండ్రి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే రాంచరణ్, ఉపాసనల నిశ్చితార్థం జరగనుందని తెలిపారు. ఇరు కుటుంబాలు కలిసి వారంలోగా నిశ్చితార్థానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాదు నగర మేయర్ కార్తీక చిరంజీవికి రాఖీ కట్టారు.
More Articles...
- సత్యసాయి బాబా జీవిత విశేషాలు
- చెద పట్టిన శ్రీజ, బరద్వాజ్ ల ప్రేమ
- మూడు గంటల్లో ముగిసిన మ్యాచ్
- ప్రముఖ రచయిత ముళ్ళపూడి ఇక లేరు
- కెన్యా కూనలపై న్యూజీలాండ్ ఘనవిజయం
- సెంచరీలతో కదం తొక్కిన సెహ్వాగ్, కోహ్లి
- నేటి నుంచి వరల్డ్ కప్ సమరం ప్రారంభం
- అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభ వేడుకలు
- మహానటి సావిత్రి 'స్టాంప్' విడుదల
- మే 5న ఎన్టీఆర్ వివాహం




























ఒక రోజు ఒకతను గుడి మెట్లపై కుర్చుని కొబ్బరిచిప్ప తింటూ...తన భార్యా మంచితనం గురించి, ఆమె తన పై చూపించే ప్రేమ గురించి మురిసిపోతూ దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు. గుడి మెట్ల మీద కదా... వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఆనందం తట్టుకోలేక కొన్ని ప్రశ్నలు అడిగాడిలా... 



మీ పిల్లలు ఫ్రూట్స్ తినమంటే తినటం లేదా?...అయితే ఇలా చేసి చూడండి.వేసవి తాపాన్ని తీర్చే చల్ల చల్లని ఫన్ జూస్ మీ కోసం.