APReporter.com

 
తెలుగుదేశం పార్టీకి ఇక తీర్ధయాత్రలే గతి : విజయశాంతి E-mail
Friday, 30 July 2010 15:55

vijayashantiతెలంగాణ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలవడంతో తెరాస నాయకురాలు, మెదక్ ఎంపీ విజయశాంతి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా విజయశాంతి మాట్లాడుతూ క్రిందటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గల్లంతు కాగా, ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గల్లంతు అయ్యిందని అన్నారు.

తెలుగుదేశం కనీసం ధరావతు సైతం కాపాడుకోలేకపోయిందని, ఇక తెలుగుదేశానికి తీర్ధయాత్రలే గతని, వారు చేసిన బాబ్లీ యాత్రఫై ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలాగే నిజామాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన డీ.శ్రీనివాస్ రెండవసారి బిజెపి అభ్యర్ధి లక్ష్మీనారాయణ చేతిలో చిత్తుగా ఓడిపోయారని, డీఎస్ అంటే నో డిపాజిట్, నో సీట్ అని విజయశాంతి భాష్యం చెప్పారు.

 
Follow us on Twitter

Who's Online

We have 53 guests online

Advertisement