| కాంగ్రెస్--తెదేపాల చెంప చెళ్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చారు : కేసీఆర్ |
|
| Saturday, 31 July 2010 11:25 | |||
|
తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి దాన్ని ఓట్లుగా మలచి గెలిపించారని, ఇకఫై తెలంగాణా రాష్ట్రాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, ఇదే స్ఫూర్తిని తెలంగాణా ప్రజలు రాష్ట్ర విభజన జరిగే వరకూ కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెరాస సాధించిన భారీ విజయాన్ని తెలుసుకుని ప్రపంచంలోని 18 దేశాలలో ఉన్న తెలంగాణా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని, అమెరికాలో శెలవు దొరకకపోయినా, బలవంతంగా శెలవు పెట్టి మరీ సంబరాలు చేసుకుంటున్నట్లు వారు తనతో చెప్పారని కేసీఆర్ తెలిపారు.శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాలో పర్యటించకుండానే ఇక్కడి ప్రజలు ఈ గెలుపుతో ఏకగ్రీవంగా తమ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీలు కనులు తెరిచి, ఈ ఎన్నికలను ఓ రెఫరెండంగా తీసుకుని, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
|