APReporter.com

 
చంద్రబాబు తెదేపా పగ్గాలను బాలకృష్ణకు అప్పగించాలి : ప్రసన్న కుమార్ E-mail
Saturday, 31 July 2010 11:51

balakrishnaతెలంగాణ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా దక్కకుండా పోవడంతో ఆ పార్టీ నుండి బహిష్కృతమైన నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చంద్రబాబుఫై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యలేక చంద్రబాబు బాబ్లీ ప్రాజక్టు డ్రామా ఆడారని, ప్రచారానికి వెళితే ప్రజలు రాళ్ళతో కొట్టి తన్ని తరిమేస్తారని చంద్రబాబు భయపడ్డారని ప్రసన్న విమర్శించారు.

చంద్రబాబు వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచి పెట్టుకుపోయిందని, ఆయన ఇంకా నాయకత్వంలో కొనసాగితే ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా తెదేపా నామరూపాలు లేకుండా పోతుందని ప్రసన్న అన్నారు. ఇకనైనా చంద్రబాబు పార్టీ పగ్గాలను స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు, సినీనటుడు బాలకృష్ణకు మరియు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు.

 
Follow us on Twitter

Who's Online

We have 52 guests online

Advertisement