Telugu News

 
మంచినీటి బిందువు వంటి జగన్ సేవలను పార్టీ వినియోగించుకోవాలి : అంబటి E-mail
Saturday, 31 July 2010 17:04

ambati_rambabuకాంగ్రెస్ బహిష్కృత నేత అంబటి రాంబాబు ఈ రోజు తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు గాంధీ భవన్ లోని క్రమ శిక్షణా సంఘం వద్దకు రాగా అక్కడ సంఘం చైర్మన్ గానీ సభ్యులు గానీ లేకపోవడంఫై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ విధమైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనప్పుడు, తనను సస్పెండ్ చేయడం అర్థరహితమని, తన సస్పెన్షన్ విషయంలో పార్టీ నిబంధనావళిని పాటించలేదని ఆయన ఆరోపించారు.

అసలు తనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం నుండి తనకు ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం అందలేదని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పకపోగా, తాను ఆయనకు రాసిన లేఖకు కుడా ఇంతవరకూ సమాధానం రాలేదని తెలిపారు.

ఈ సందర్భంలో అంబటి కడప ఎంపీ వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ " జగన్ ఉప్పునీటి సముద్రంలో మంచినీటి బిందువు వంటి వాడని, ఆయన సేవలను పార్టీ సరైన రేతిలో వినియోగించుకోవాలని " సూచించారు. అలాగే పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీనియర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 
Follow us on Twitter

Who's Online

We have 45 guests online

Advertisement