Telugu News

 
ప్రజల సెంటిమెంటు వల్లే తెరాస గెలిచింది : పురంధరేశ్వరి E-mail
Saturday, 31 July 2010 17:56

purandareswariవిశాఖకు వచ్చిన కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి పురంధరేశ్వరి తెలంగాణ ఉప ఎన్నికలఫై ఈ విధంగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు బలంగా ఉందని, అందువల్లనే తెరాస గెలిచిందని అన్నారు. కాబట్టి తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని, ఉప ఎన్నికల ఫలితాలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకొని విశ్లేషిస్తుందని ఆమె తెలిపారు.

అలాగే జీవన్ రెడ్డి, శాసనసభ్యుడు పి.శంకరరావు మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రజల సెంటిమెంటు బలంగా పని చేసిందని, అందువల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిందని, ఇకఫై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యతను తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు తీసుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు.

 
Follow us on Twitter

Who's Online

We have 15 guests online

Advertisement