Thursday, May 17th

RSS

Telugu News - Online Telugu News Portal

కాసేపు నవ్వుకోండి!

మాఆవిడ చాలా మంచిది

ఒక రోజు ఒకతను గుడి మెట్లపై కుర్చుని కొబ్బరిచిప్ప తింటూ...తన భార్యా మంచితనం గురించి, ఆమె తన పై చూపించే ప్రేమ గురించి మురిసిపోతూ దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు. గుడి మెట్ల మీద కదా... వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఆనందం తట్టుకోలేక కొన్ని ప్రశ్నలు అడిగాడిలా...

స్వామీ! "నా భార్యను ఎందుకు అంత అందంగా పుట్టించావు?"
దేవుడు: "ఆమెను నువ్వు ప్రేమించడానికి నాయన!"

స్వామీ! "మరి ఆమె కు ఎందుకు అంతా దయాగుణాన్ని ఇచ్చావు"
దేవుడు: "ఆమెను నువ్వు ప్రేమించడానికి నాయన!"

స్వామీ! "అంత రుచికరమైన వంటలను ఆమెకు ఎందుకు నేర్పించావు?"
దేవుడు: "ఆమెను నువ్వు ప్రేమించడానికి నాయన!"

స్వామీ! "ఆమెకు ఇన్ని ఇచ్చిన నువ్వు, ఎందుకు తెలివితేటలను ఇవ్వలేదు."
దేవుడు: "ఆమె నిన్ను ప్రేమించడానికి నాయనా!"

కంగుతిన్నాడా భక్తుడు!!!