అధిష్ఠానం ఆదేశాన్ని ధిక్కరించి సెప్టెంబరు 2వ తేదీ నుండి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్నారు వైఎస్ఆర్ తనయుడు, కడప ఎంపీ వైఎస్ జగన్. అయితే ప్రకాశం జిల్లాలో ఆయన యాత్ర మరో నెలరోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. అభిమానులు, కార్యకర్తలు పట్టుబడుతుండటంతో ఆహ్వానించిన చోటకల్లా జగన్ వెళుతున్నారు. దీనితో ముందు ఎంపిక చేసిన గ్రామాలతో పాటు ఇప్పుడు మరికొన్ని గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ప్రకాశం తర్వాత నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటించనుండగా, అధిష్ఠానం యాత్రలో పాల్గొనవద్దని హెచ్చరించినా వినకుండా నెల్లూరు యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తూ
రోశయ్య వర్గంఫై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత శ్రీధర్ రెడ్డిని హైకమాండ్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
సస్పెన్షన్ తో ఆగ్రహానికి గురైన శ్రేధర్ రెడ్డి అధిష్ఠానంఫై మండిపడుతూ, పార్టీకి సైనికుల్లాంటి తమకు షోకాజ్ నోటీసులు ఇస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఖాయమని, అసలు జగన్ లేకపోతే కాంగ్రెస్ కు ఉనికే లేకుండా పోతుందని అన్నారు.
| < Prev | Next > |
|---|


