Thursday, May 17th

ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నా లేకపోయినా ఒక్కటే : చంద్రబాబు

chandrababu_naiduతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం రాజమండ్రిలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే దమ్మూ, ధైర్యం లేకనే ప్రభుత్వం వాటిని వాయిదా వేసిందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, యంత్రాంగం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ అక్రమాలపై ప్రభుత్వం చర్య తీసుకోలేకపోతోందని, ఈ భూకుంభకోణంలో కోట్లాది రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బాబు అన్నారు. అసలు ముఖ్యమంత్రి సీటులో ఉన్న రోశయ్య పేరుకు మాత్రమే సీఎం తప్ప ఆయన ఉన్నా లేకపోయినా ఒక్కటేనని చంద్రబాబు తెలిపారు.