తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిష్కర్త గద్దర్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేసి మాట్లాడటం సరికాదని, ఆయన ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలకు చెందినవాడని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపితే చిరూతో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని
, ఈ విషయమై చిరూ పునరాలోచిస్తారన్న నమ్మకం తనకు ఉందని, అవసరమైతే దీనిఫై చిరూతో నేరుగా మాట్లాడతానని గద్దర్ తెలియజేశారు.
అలాగే తెరాస ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, వారిని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణ ప్రజల ఆశలతో ఆడుకుంటోందని, దీని చర్యల వల్ల రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతాయే తప్ప తెలంగాణ రాష్ట్రం రాదని గద్దర్ తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం రావాలంటే రెండు ప్రాంతాల ప్రజలు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించేలా, నాయకులు వారి మధ్య శాంతియుత వాతావరణం కల్పించాలని గద్దర్ కోరారు. తెరాస ఇలా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రెండు ప్రాంతాల మధ్య అగ్గిని రాజేయడం మంచిది కాదని గద్దర్ తెలిపారు.
| Next > |
|---|


