ఫోర్జరీ పత్రాలతో 70 కిలోల బంగారాన్ని లోన్‌గా తీసుకుని ఓ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టాడన్న ఆరోపణలతో సంజయ్ అగర్వాల్ అనే వ్యాపారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోఠిలోని ఓ జ్యూయెలరీ దుకాణం యజమాని సంజయ్ అగర్వాల్ 2010వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగు దఫాలుగా గోల్డ్‌ను లోన్‌గా తీసుకున్నాడు. నిందితుడు ఫేక్ బ్యాంక్ గ్యారెంటితో ఈ లోన్ తీసుకున్నాడు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్లు చూపించి ఎస్బిఐలో ఆయన ఈ లోన్ పొందాడు.
Welcome to the Frontpage
బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి అరెస్ట్
- Friday, 03 February 2012 11:26
జయ దెబ్బ : శశికళ సోదరుడు దివాకరన్ అరెస్టు
- Friday, 03 February 2012 10:26
పార్టీ నుంచి బహిష్కరించిన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో దెబ్బ తీశారు. శశికళ సోదరుడు దివాకరన్ను తిరువారూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రిషియూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటిని కూల్చిన కేసులో దివాకరన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు దివాకరన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
చిరంజీవి తెలంగాణ, సీమాంధ్ర రెంటికీ చెందినవాడు : గద్దర్
- Saturday, 09 October 2010 09:54
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిష్కర్త గద్దర్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేసి మాట్లాడటం సరికాదని, ఆయన ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలకు చెందినవాడని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపితే చిరూతో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని
టిటిడికి వ్యతిరేకంగా తిరుమలకు కాలిబాటలో : చిన్న జీయర్
- Friday, 03 February 2012 10:43
చిన్న జీయర్ శిష్యులతో తిరుపతి కోలాహలంగా మారింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మరికొద్దిసేపట్లో విష్ణు సహస్రనామ స్త్రోత్రపారాయణం జరగనుంది. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలిబాటలో జీయర్ యాత్ర చేపడతారు. టిటిడి 110 తప్పులు చేసిందని ప్రకటించిన నేపథ్యంలో చిన్నజీయర్ పర్యటన ఉత్కంఠగా మారింది. గతంలో టీటీడీపై చేసిన వాదనకు తాను కట్టుబడి ఉన్నానని దీనిపై పూర్తిస్తాయిలో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.
ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నా లేకపోయినా ఒక్కటే : చంద్రబాబు
- Saturday, 09 October 2010 09:07
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం రాజమండ్రిలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే దమ్మూ, ధైర్యం లేకనే ప్రభుత్వం వాటిని వాయిదా వేసిందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, యంత్రాంగం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై ప్రభుత్వం చర్య తీసుకోలేకపోతోందని, ఈ భూకుంభకోణంలో కోట్లాది రూపాయల మేర అవినీతి


