|
Friday, 30 July 2010 12:04 |
|
దర్శకుడు తేజ నిర్మించిన "జయం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సదా ఆ ఫై పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించినా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సదా సూపర్ హిట్ అయిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న " చంద్రముఖి--2 " లో వెంకటేష్ పక్కన చిన్న క్యారక్టర్ చేస్తోంది. దీని గురించి సదా చెబుతూ అసలు చంద్రముఖి చిత్రానికి దర్శకుడు పి.వాసు మొదట తననే అడిగారని, అయితే తను అపరిచితుడు చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశం జ్యోతికకు దక్కిందని తెలిపింది.
తరువాత చంద్రముఖికి సీక్వెల్ గా వచ్చిన కన్నడ " ఆప్తరక్షక " లో నటించమని వాసు అడగగా కొన్ని కారణాల వల్ల చెయ్యలేకపోయానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వెంకటేష్ తో కలిసి నటించే ఛాన్స్ ను ఎంతమాత్రం వదులుకోనని చెబుతున్న సదా ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రంలో మరియు కన్నడంలో ఒక చిత్రంలో నటిస్తోంది.
|