Telugu News

 
కన్నడ సీమలో అడుగెడుతున్న కాజల్ E-mail
Friday, 30 July 2010 13:03

kaajalలక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెరంగేట్రం చేసి మగధీర చిత్రంతో ఒక్కసారిగా టాప్ రేంజ్ కు వెళ్ళిన కాజల్, తరువాత వచ్చిన  డార్లింగ్ సినిమా కూడా హిట్ కావడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కాజల్ రామ్ చరణ్ తో "మెరుపు", జూనియర్ ఎన్టీఆర్ తో " బృందావనం " మరియు దశరధ్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇవే కాక కాజల్ రెండు తమిళ చిత్రాలలో కూడా నటిస్తోంది.

తాజాగా కాజల్ ఒక కన్నడ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.  కొత్త దర్శకుడు రఘు హసన్‌ తీస్తోన్న "తథాస్తు" చిత్రంలో  హీరో చిరాగ్‌ సరసన కాజల్ నటిస్తున్నట్లు హాసన్ తెలిపారు. మొదట ఈ సినిమాకోసం బాలీవుడ్‌ నటి సోనమ్ ‌కపూర్‌ ను సంప్రదించినప్పటికీ, ఇప్పుడు ఆ పాత్రకు కాజల్ ను ఖరారు చేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాని అంజలీ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు.

 
Follow us on Twitter

Who's Online

We have 24 guests online

Advertisement