Telugu News

 
మహేష్ తో మరోసారి రొమాన్స్ చేస్తానంటున్న ఇలియానా E-mail
Saturday, 31 July 2010 14:58

mahesh_ileana"పోకిరి" సినిమాతో హిట్ పెయిర్ గా పేరుపొందిన మహేష్ బాబు--ఇలియానా మరోసారి జత కట్టనున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "త్రీ ఇడియట్స్" చిత్రాన్నితెలుగు, తమిళ వర్షన్స్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జెమిని ఫిలిం సర్క్యూట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నారన్న వార్తలు ఇప్పటికే టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా ఇలియానా ఎంపికైనట్లు సమాచారం.

ప్రస్తుతం శంకర్ రజనీకాంత్   "రోబో" చిత్రంతో , మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో "ఖలేజా" సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక గోవా సుందరి ఇలియానా జూనియర్ ఎన్టీఆర్ "శక్తి"తో, విక్రమ్ "వేడి"తో పవన్ కళ్యాణ్ తో "ఖుషీగా" నటిస్తోంది. ఈ చిత్రాలు అయిన వెంటనే శంకర్ చిత్రం మొదలవనుంది.

 
Follow us on Twitter

Who's Online

We have 51 guests online

Advertisement