Telugu News

 
అక్కినేని హీరోలతో కృష్ణవంశీ చిత్రం E-mail
Saturday, 31 July 2010 16:40

nagarjunaచంద్రలేఖ సినిమా తరువాత కృష్ణవంశీతో క్లాష్ రావడంతో అప్పటినుండి కృష్ణవంశీతో నటించని నాగార్జున, ఈ మధ్యనే అన్నీ మరచిపోయి ఒక మంచి సబ్జెక్ట్  రెడీ చెయ్యమని వంశీకి చెప్పాడట. అయితే కృష్ణవంశీ ఒక్క నాగార్జునకే కాక ఆయన తండ్రి నాగేశ్వరరావు మరియు తనయుడు నాగ చైతన్యకు కూడా సరిపోయే సబ్జెక్ట్ సిద్ధం చేసి నాగ్ కు వినిపించాడట. దాంతో మైండ్ బ్లాక్ అయిన నాగార్జున వెంటనే ఈ సినిమా చేద్దామనే ఎక్సైట్మెంట్ తో ఉన్నాడట.

చందమామ చిత్రాన్ని నిర్మించిన సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబరులో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కాలంలో విడుదల చెయ్యడానికి కృష్ణవంశీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుండీ అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ చిత్రం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

 
Follow us on Twitter

Who's Online

We have 26 guests online

Advertisement