Wednesday, Feb 22nd

RSS

Telugu News - Online Telugu News Portal

ICC WORLD CUP 2011

గొప్ప అవకాశాన్ని కోల్పోయాను : ప్రవీణ్ కుమార్

ప్రపంచకప్ సాధించిన భారతజట్టులో ఆడే గొప్ప అవకాశాన్ని కోల్పోయానని ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అయితే భారత జట్టులోకి తిరిగి రావడానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తానని ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాంఖడే స్టేడియంలో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ఇతర జట్టు సభ్యులు విజయోత్సవాన్ని జరుపుకంటుంటే తాను వుంటే బావుండేదన్న ఫీలింగ్ కలిగిందని ఓ వార్త సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

Read more...

చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడొద్దు : అఫ్రిదీ

భారత అభిమానులపై ఆరోపణలు చేసిన పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ రోజు గడవకముందే మాట మార్చాడు. తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని అఫ్రిదీ తెలిపాడు. భారతీయులు విశాల హృదయులు కారని పాక్ సారధి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాఖ్యల కారణంగా అతనిపై ఇంటా, బయటా విమర్శలు చెలరేగడంతో దానిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెపారు. మీడియా చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూపిస్తోంది, ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

Read more...

ధోనీ తెలివైన కెప్టెన్ : సచిన్

భారత జట్టు కెప్టెన్ ధోనిపై మాస్టర్ బ్లాస్టర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తన క్రికెట్ జీవితంలో మహేంద్రసింగ్ ధోని ‘బెస్ట్ కెప్టెన్’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. జట్టును సమర్థవంతంగా నడిపించిన ధోనీ తెలివైన కెప్టెన్ అని సచిన్ కితాబిచ్చాడు. ఇప్పటి వరకు తాను ఆడిన 21 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ జీవితంలో ఉత్తమ కెప్టెన్ స్థానం ధోనిదే అన్నారు. ఫీల్డ్ లోపల, వెలుపల బౌలర్లతో, బ్యాట్స్‌మెన్‌తో, సీనియర్ ప్లేయర్లతో నిరంతరం చర్చిస్తుంటాడని సచిన్ వెల్లడించాడు.

Read more...

అది నిజమైన ట్రోఫీనే : ఐసీసీ

వరల్డ్ కప్ ట్రోఫీ నకిలీదంటూ వస్తున్న వార్తలను ఐసీసీ కొట్టిపారేసింది. ట్రోఫీ ఒరిజినల్‌దేనని స్పష్టం చేసింది. ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు ముందే ఒరిజినల్ ట్రోఫీ బీసీసీఐ కార్యాలయానికి దగ్గరకు చేరిందని స్పష్టం చేసింది. పన్ను చెల్లించకపోవటంతో అసలు కప్‌ను ముంబాయి కస్టమ్స్ అధికారులు తమ దగ్గరే ఉంచుకున్నారని ధోనీ జట్టు తీసుకున్నది నకిలీదని మీడియాలో వార్తలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు దీనిపై ఐసీసీ, బీసీసీఐ లతో మాట్లాడారు. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు భారత జట్టు దగ్గర ఉన్న ప్రపంచ కప్ నిజమైనదేనని తేల్చి చెప్పారు.

గ్యారీని విడిపోవడం బాధాకరం : యువరాజ్

మ్యాన్ అఫ్ ది టోర్నీ విజేత యువరాజ్ టీమిండియా కోచ్ గ్యారీ కిరిస్టేన్ ని ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు. ప్రపంచకప్ సాధించామన్న ఆనందంలో గ్యారీని విడిపోవడం బాధ కలిగిస్తోందని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు. భారత జట్టుకు కోచ్ గ్యారీ కిరిస్టెన్ తండ్రి లాంటివాడని యువరాజ్ తెలిపారు. స్పూర్తిని కలిగించే వ్యక్తి గ్యారీ అని అన్నాడు.

Read more...

ఐసీసీ వరల్డ్ ఎలెవన్ లో సచిన్, యువీ, జహీర్

ప్రపంచ కప్ లో ఆటగాళ్ళ ప్రదర్శన ప్రకారంగా అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత ముగ్గురు భారత ఆటగాళ్ళు చోటు దక్కించుకున్నారు. ఈ ప్రపంచ కప్ లో రెండవ అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టోర్నీ అంతా నిలకడగా ఆడుతూ, జట్టుకు అవసరమైన సమయంలో

Read more...