Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ICC WORLD CUP 2011

పాక్ పై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న సెహ్వాగ్

మొహాలీలో జరుగుతున్న భారత్, పాక్ సెమీ ఫైనల్‌లో సెహ్వాగ్ పాక్‌పై తన వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆటను ఫోర్ కొట్టి ప్రారంభించాడు. కాగా సెహ్వాగ్ ఫోర్‌తో ఆటను ప్రారంభించడం ఇది వరుసగా ఆరోసారి. గుల్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టాడు. మంచి ఊపులో ఉన్న సెహ్వాగ్ (24 బంతుల్లో 9 ఫోర్లతో 38) రియాజ్‌ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సెహ్వాగ్ స్థానంలో గంభీర్ బ్యాటింగ్‌కు దిగాడు. సచిన్ నిలకడగా ఆడుతున్నాడు. భారత్ స్కోరు 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు.