Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ICC WORLD CUP 2011

భారత్ ఘనవిజయం

పంజాబ్ లోని సి.ఎ స్టేడియం, మొహాలి లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ అద్బుత విజయాన్ని సాదించింది. భారత్ జట్టు 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ వరల్డ్ కప్ పైనల్ లో చేరింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ పిట్చ్ బట్టింగ్ కి అనుకూలంగా లేక పోవడంతో అభిమానులు ఆశించిన మేరకు పరుగులు తీయలేక పొయినప్పటికీ, ఫీల్డింగ్ మరియు బౌలింగ్ లో అదరగొట్టింది. పాకిస్థాన్ ను చిత్తు చిత్తు గా ఓడించి భారత్ తన సత్తాను చాటుకుంది. ఈ విజయంతో భారత్ తన హిస్టరీలో 3వ సారి ప్రపంచ కప్ ఫైనల్లోకి చేరుకుంది.

కోట్లాది మంది ఈ మ్యాచ్ ను తిలకించారు. దేశంలోని ఎంతో మంది ప్రముకులు ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు. 85 పరుగులు చేసిన సచిన్ కు మేన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. భారత్ జట్టు విజయంతో దేశంలో అభిమానుల సందడి తారా స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ 2న భారత్ శ్రీలంకతో ఫైనల్ ఆడనుంది. ఇదే రీతిలో ఆడి భారత్ ప్రపంచ కప్ సాదించాలని కోరుకుందాం. జయహో భారత్!