ఫైనల్ కు ముందు భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయం కారణంగా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు దూరమవుతున్నాడు. పాక్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అఫ్రిదీ ఇచ్చిన క్యాచ్ ను అందుకునే ప్రయత్నంలో అతని వేలుకు గాయమయింది. ఐతే ఇది భారత్ కు పెద్ద డ్రాబ్యాక్ కాకపోవచ్చు. అతని స్థానాన్ని మునాఫ్ పటేల్ భర్తీ చేస్తాడు.
పాక్ తో మ్యాచ్ లో వీరిద్దరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎవరిని తక్కువ చేసి చూడలేము. మొహాలీ పిచ్ కు ముగ్గురు పెసర్లు అవసరం అని జహీర్, నెహ్రా, మునాఫ్ లను తీసుకున్నారు. కాని వాంఖడేకు ఇద్దర్లు స్పిన్నర్లు తప్పని సరి. సో.. మునాఫ్, నెహ్రా లలో ఎవరినైనా ఒకరిని తీసివేయాలి. ఇది ధోనికి సవాలు లాంటిది.
నెహ్రా గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో మునాఫ్ ని తీసుకోనున్నారు. అదే విధంగా లంక జట్టులో మురళీ, మాథ్యుస్ గాయాలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.
| < Prev | Next > |
|---|









