భారత్-శ్రీలంకల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ వేసేటప్పుడు కొంత అయోమయం చోటుచేసుకుంది. టాస్ వేసినప్పుడు సంగక్కర చెప్పినది రిఫరల్ సరిగా వినలేదు. దీంతో మరోసారి టాస్ వేశారు. టాస్ గెలిచిన వెంటనే సంగక్కర బ్యాటింగ్ తీసుకున్నాడు. ఐతే తొలుత టాస్ వేసినపుడు భారత్ గెలవడం విశేషం. అనంతరం ధోని మాట్లాడుతూ టాస్ వల్ల పెద్ద ప్రయోజనం చేకురదని, మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నామని తెలిపాడు.
భారత జట్టులో ఒక మార్పు చేశారు. ఆశిష్ నెహ్రా స్థానంలో శ్రీశాంత్ ని తీసుకున్నారు. లంక జట్టులో నాలుగు మార్పులు చేశారు. చమర సిల్వ, ఫెర్నాండో, మాథ్యుస్, మెండీస్ స్థానాలలో కులశేఖర, పెరీరా, రణదీవ్, హెరాత్ లు వచ్చారు. మ్యాచును చూడడానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే, భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వచ్చారు.
| < Prev | Next > |
|---|









