ప్రపంచకప్ సాధించిన భారతజట్టులో ఆడే గొప్ప అవకాశాన్ని కోల్పోయానని ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అయితే భారత జట్టులోకి తిరిగి రావడానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తానని ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాంఖడే స్టేడియంలో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ఇతర జట్టు సభ్యులు విజయోత్సవాన్ని జరుపుకంటుంటే తాను వుంటే బావుండేదన్న ఫీలింగ్ కలిగిందని ఓ వార్త సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
క్రికెట్‌లో గాయాలపాలవ్వడం ఓ భాగమేనని అన్నారు. ప్రస్తుతం వందశాతం ఫిట్‌నెస్‌తో వున్నానని అన్నారు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ప్రవీణ్ సభ్యుడిగా వున్నారు. అయితే గాయం కారణంగా జట్టునుంచి తప్పుకోవాల్సి రావడంతో శ్రీశాంత్‌కు అదృష్టం వరించింది.
| Next > |
|---|









