|
Tuesday, 15 June 2010 18:20 |
|
ముమైత్ ఖాన్ ఒక క్యాబరే డాన్సర్ గా విభిన్నంగా నటిస్తున్న చిత్రం 'యల్ బోర్డ్'. ఈ సినిమా జూన్ 25 వ తారీకున విడుదల చేయనున్నారని ఈ చిత్ర దర్శకుడు ఎం.వినోద్ తెలిపారు. ఒక మాఫియా లీడర్ కి క్యాబరే డాన్సర్ కి మధ్య జరిగే ప్రేమకథ అని ఆయన తెలిపారు. ఈ సినిమాలో క్యాబరే డాన్సర్ గా ముమైత్ ఖాన్ కేక పుట్టించిందని అన్నారు.
ఈ సినిమాకి బప్పిలహరి సంగీతాన్ని అందించడం ఒక విశేషం. ఈ సినిమాను హిందీలో కుడా విడుదల చేయనున్నారని వారు తెలిపారు. మరి ముమైత్ ఖాన్ ఏమాత్రం కేక పుట్టిస్తుందో చూడాలంటే 25 తారీకు వరకు ఆగాల్సిందే!
|
|
|
Tuesday, 15 June 2010 17:51 |
|
క్రియేటివ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్సకత్వంలో, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ , మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచన్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "రోబో". ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ లోను విడుదల చేయనున్నారు.
అయితే విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో మన 'బిగ్ బి' అమితాబ్ కూడా ఒక గెస్టు పాత్ర వేస్తున్నాడని వస్తున్న ఉహాగానాలతో రోబో సినిమా మీద అందరికీ ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమాలో అమితాబ్ ఎలా చేస్తాడో, శంకర్ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
|
|
Tuesday, 15 June 2010 17:26 |
|
తూర్పు గోదావరి జిల్లలో గత వారం రోజులనుండి విస్తారంగా కురుస్తున వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం పెరిగిందని రాజమండ్రి రెవెన్యు అధికారులు తెలిపారు. అయితే దీనివలన ప్రమాదమేమి లేదని వారు తెలిపారు. అటు ధవళేస్వరం బ్రిడ్జి వద్ద గోదావరి నీటి మట్టం 14 మీటర్లు వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఏదిఏమైనా ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందు జాగర్త చర్యలు తీసుకుంటునట్లు రెవెన్యు అధికారులు తెలిపారు.
|
|
Tuesday, 15 June 2010 15:22 |
|
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబూ దుబాయ్ లో ఎమరిటి సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రసాద్ అనే హైదరాబాదుకు చెందిన వ్యక్తి సోమవారం భవనంపై నుంచి పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న ప్రసాద్ అంతకు ముందు కార్యాలయంలో ప్రతి ఒక్కరికీ నీరు అందించాడని, ఆ మరుక్షణమే అతను కింద పడిపోయిన శబ్దం వినిపించిందని సహ కార్మికుడు చెప్పాడు.
ప్రసాద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే మరేమైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సివుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
Monday, 14 June 2010 20:30 |
|
సత్యం కంప్యూటర్స్ మాజీ చీఫ్ రామలింగరాజు కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పీవీఎల్ ఎన్.చక్రవర్తి ఈ రోజు తెలిపారు. నిజాం వైద్య విజ్ఝాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందుతున్న రామలింగరాజు ఇప్పట్లో కోర్టుకు వచ్చే పరిస్థితి లేనందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని సీబీఐ కోర్టులో వాదించింది. ఈ విషయమై కోర్టులో వాదనలు జరుగగా, సత్యం కేసులో సీబీఐ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, ఏ అభియోగాలపై విచారణ జరుపుతారో ముందు తేల్చాలని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. మూడు ఛార్జిషీట్లు కలిపి ఒకే కేసుగా విచారణ జరపాలని వారు కోరారు. ప్రస్తుత దశలో వీడియో కాన్ఫరెన్స్ విచారణ అవసరమే లేదని వారు అన్నారు. రామలింగ రాజు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిక సమర్పించిన నిమ్స్ వైద్యులు ఆయనకు హైపటైటిస్ బి తీవ్రంగా ఉందని 24 వారాల పాటు చికిత్స అవసరమని తమ నివేదికలో తెలిపారు.
|
|
Monday, 14 June 2010 18:58 |
|

శేరిలింగంపల్లి సెగ్మెంట్‌కు చెందిన కొంతమంది తెదేపా నేతలు ఆదివారం తెరాసలో చేరిన సందర్భంగా తెరాస అధ్యక్షుడు కేసిఆర్ మాట్లాడుతూ రాజీనామాలపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్, తెదేపాలు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎవరిని ఓడిస్తారని, గెలిచి వెళ్ళి ఢిల్లీలో ఏం చెబుతారని ? తెలంగాణా ఇవ్వొద్దని చెబుతారా ? వీరికి నీతి జాతి ఏంటి అని కాంగ్రెస్, తెదేపాలఫై మండిపడ్డారు. ఉపఎన్నికల్లో సిగ్గూ, లజ్జా, నీతి లేనివారే పోటీ చేసేందుకు సిద్ధపడతారని, రాజీనామాలు చేయమని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో కోరినా పట్టించుకోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు ఇపుడు ఏ ముఖంపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.
గత సంవత్సరం డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ప్రకటించారని, అయితే దీన్ని చంద్రబాబునాయుడే అడ్డుకున్నారన్నారు. హైదరాబాద్, మెదక్ , నల్గొండ , రంగారెడ్డి జిల్లాల్లో ముస్లింలకు ఉన్న 4 లక్షల కోట్ల విలువైన భూమిని ఆంధ్రా రియల్ స్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని కేసిఆర్ అన్నారు .
|
|
|
|
|
|
|
Page 103 of 139 |