Thursday, May 17th

RSS

Telugu News - Online Telugu News Portal

తగ్గిన ఆంధ్రాబ్యాంక్ లాభం

ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి(క్యూ3) నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 8.45 శాతం క్షీణించి రూ.330.91 కోట్ల నుంచి రూ.303.17 కోట్లకు తగ్గింది. కార్పొరేట్ రుణాల పునర్ వ్యవస్థీకరణ, వడ్డీ లాభదాయకతపై ఒత్తిడి లాభాలు తగ్గడానికి కారణాలని బ్యాంక్ సీఎండీ బి.ఎ.ప్రభాకర్ తెలిపారు. గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన తమ బ్యాంకు ఫలితాలను ప్రకటించారు.

Read more...

పన్ను వసూళ్ల లక్ష్యాలు సాధించాలి: ప్రణబ్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.10 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్య సాధనకు పన్ను అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. కస్టమ్స్ చట్టం స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఇక్కడ గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారుల, వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు.  ఈ సందర్భంగా ప్రణబ్ 2012 కస్టమ్స్ మాన్యువల్, కస్టమ్స్ ట్రైనింగ్ మాన్యువల్‌ను ఆవిష్కరించారు. సీబీఈసీ చైర్మన్ ఎస్‌కే గోయెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, తమ బోర్డు ముందు ఉన్న దాదాపు రూ. 4 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్య సాధనలో డిసెంబర్ నాటికి 70 శాతం సాధించినట్లు వివరించారు.

ధనిక దేశాలను అనుసరించొద్దు: వైవీ రెడ్డి

ఆర్థిక విషయాల్లో స్వీయ నియంత్రణ ఉండాలే కాని గ్లోబలైజేషన్ పేరుతో ఇతర దేశాలపై అతిగా ఆధారపడకూడదని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ డాక్టర్ వైవీ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇండియా వంటి వర్ధమాన దేశాలు గుడ్డిగా సంపన్న దేశాల ఆర్థిక విధానాలను అనుసరించకూడదన్నారు.

Read more...

కోల్ ఇండియాకు తొలి మహిళా సీఎండీ

ప్రభుత్వరంగ దిగ్గజం కోల్ ఇండియా(సీఐఎల్)కి సీఎండీ బాధ్యతలను తొలిసారిగా ఒక మహిళా అధికారి చేపట్టనున్నారు. బొగ్గు శాఖలో అదనపు కార్యదర్శి అయిన జోహ్రా చటర్జీ నేడు ఆ కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటిదాకా అదనపు బాధ్యతల కింద ఈ స్థానంలో కొనసాగిన ఎన్‌సీ ఝా పదవీకాలం మంగళవారంతో ముగిసినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన జోహ్రా చటర్జీ ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వ నామినీ డెరైక్టర్‌గా కూడా ఉన్నారు.

Read more...

2015 నాటికి... 150 ‘తాజ్’ హోటళ్లు

ఆతిథ్య రంగంలో ఉన్న తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ 2015 నాటికి తన హోటళ్ల సంఖ్యను 150కి పెంచుకోనున్నది. ప్రస్తుతం సంస్థకు తాజ్, వివాంటా, గేట్‌వే, జింజర్ బ్రాండ్లలో భారత్‌లో 94, విదేశాల్లో 16 హోటళ్లున్నాయి. బడ్జెట్ హోటల్స్ బ్రాండ్ అయిన జింజర్‌కు, దీని కంటే కొంచెం ఖరీదైన హోటల్ బ్రాండ్ గేట్‌వేకు మధ్య మరో బ్రాండ్‌ను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది భారత్‌లో మూడు వారాలకో హోటల్‌ను ఆవిష్కరించనున్నారు.

Read more...