సంవత్సరం మొత్తం మీద చూస్తే మీరు ఈక్విటీల్లో రూ.1.02 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటే స్థిరాదాయం ఇచ్చే వాటిలో రూ.1.08 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. అంటే మీ పోర్ట్‌ఫోలియో ఈక్విటీ, డెట్ నిష్పత్తి 48:52గా ఉంది. దీని ప్రకారం మీ పోర్ట్‌ఫోలియో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ఇప్పుడు మీ బీమా, స్కూలు ఫీజులకు అవుతున్న వ్యయం రూ.71,000 ఈక్విటీలకు కేటాయిస్తే పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ వాటా పెరిగి రిస్క్ బాగా పెరుగుతుంది. కాబట్టి రికరింగ్ డిపాజిట్ల(ఆర్‌డీ)కు కేటాయిస్తున్న మొత్తాన్ని తగ్గించి ఆ మేరకు డెట్ పథకాల్లోకి మరల్చాలన్న మీ నిర్ణయం సరైనది.
| < Prev | Next > |
|---|


