Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

2015 నాటికి... 150 ‘తాజ్’ హోటళ్లు

ఆతిథ్య రంగంలో ఉన్న తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ 2015 నాటికి తన హోటళ్ల సంఖ్యను 150కి పెంచుకోనున్నది. ప్రస్తుతం సంస్థకు తాజ్, వివాంటా, గేట్‌వే, జింజర్ బ్రాండ్లలో భారత్‌లో 94, విదేశాల్లో 16 హోటళ్లున్నాయి. బడ్జెట్ హోటల్స్ బ్రాండ్ అయిన జింజర్‌కు, దీని కంటే కొంచెం ఖరీదైన హోటల్ బ్రాండ్ గేట్‌వేకు మధ్య మరో బ్రాండ్‌ను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది భారత్‌లో మూడు వారాలకో హోటల్‌ను ఆవిష్కరించనున్నారు.

వీటిలో 4 వివాంటా, 13 జింజర్ హోటళ్లుం టాయని ఇండియన్ హోటల్స్ ఎండీ, సీఈవో రేమండ్ ఎన్ బిక్సన్ సోమవారమిక్కడ తెలిపారు. తాజ్ జీవీకే హోటల్స్ బేగంపేటలో నిర్మించిన వివాంటా బై తాజ్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు.