Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

కోల్ ఇండియాకు తొలి మహిళా సీఎండీ

ప్రభుత్వరంగ దిగ్గజం కోల్ ఇండియా(సీఐఎల్)కి సీఎండీ బాధ్యతలను తొలిసారిగా ఒక మహిళా అధికారి చేపట్టనున్నారు. బొగ్గు శాఖలో అదనపు కార్యదర్శి అయిన జోహ్రా చటర్జీ నేడు ఆ కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటిదాకా అదనపు బాధ్యతల కింద ఈ స్థానంలో కొనసాగిన ఎన్‌సీ ఝా పదవీకాలం మంగళవారంతో ముగిసినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన జోహ్రా చటర్జీ ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వ నామినీ డెరైక్టర్‌గా కూడా ఉన్నారు.

బొగ్గు రేట్ల పెంపు ఉపసంహరణ కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో కొత్త విధానం కింద పెంచిన బొగ్గు రేట్లను ఉపసంహరిస్తున్నట్లు కోల్ ఇండియా మంగళవారం తెలిపింది. ఈ రేట్లను అంతర్జాతీయ రేట్ల నుంచి విడగొట్టనున్నట్లు తద్వారా వివిధ గ్రేడ్ల బొగ్గు ధరలు కూడా తగ్గుతాయని సంస్థ చైర్మన్ ఎన్‌సీ ఝా చెప్పారు. ధరల్లో కోత ఈ నెల 1 నుంచి వర్తిస్తుందని ఆయన తెలిపారు.