|
Thursday, 02 September 2010 10:13 |
|
రోజురోజుకు ప్రియమవుతున్న బంగారం ధరలు నిన్న తారాస్థాయికి చేరాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.19360కి చేరుకుంది. ఆల్ టైం హై వ్యాల్యూ ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా ఎన్నడూ లేనంతగా 31245 రూపాయలకు చేరుకుంది. రేటు పెరిగినప్పటికీ కొనుగోళ్ళు ఎంతమాత్రం తగ్గలేదని దుకాణం దారులు చెబుతున్నారు.
|
|
|
Saturday, 31 July 2010 09:14 |
|
ప్రభుత్వ రంగంలోని ఉక్కు ఉత్పత్తి కంపెనీ సెయిల్ స్టీల్ ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్మాణ, అటోమొబైల్ రంగాల నుంచి స్టీల్‌కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉక్కు ఉత్పత్తిలో సెయిల్ అతిపెద్ద కంపెనీ. దేశీయ మార్కెట్లో ఈ కంపెనీ వాటా 20 శాతంగా ఉంది. ఒక వేళ ఈ కంపెనీ స్టీల్ ధరలను పెంచితే మిగతా కంపెనీలైన జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎస్సార్ తదితర కంపెనీలు కూడా పెంచేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో జనవరి నెలలో టన్నుకు 615 డాలర్ల గరిష్ఠ స్థాయికి పెరిగిన హాట్ రోల్డ్ కాయిల్స్ ధర, జూలై నెలలో 550 డాలర్లకు పడిపోయింది. ఇందుకు కారణం యూరప్ దేశాలతో పాటు చైనాలో మాన్యుఫాక్చరింగ్ రంగంలో కార్యకలాపాలు మందగించడమే వర్మ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు హాట్ రోల్డ్ కాయిల్స్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది జూలైలో పలు స్టీల్ ఉత్పత్తుల ధరలు 4 శాతం తగ్గి 13 శాతానికి చేరాయని, అటు నిర్మాణ, ఇటు ఆటోమొబైల్ రంగాల నుంచి స్టీల్‌కు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల్లో స్టీల్ ధరలను సవరించే అవకాశం ఉన్నట్లు కంపెనీ అధికార వర్గాలు తెలిపాయి. స్టీల్ ధరలు పటిష్టపడుతున్నాయని, దీని వల్ల ధరలు పైకి పెరిగే విధంగా వత్తిడి ఉందని సెయిల్ చైర్మన్ సిఎస్ వర్మ తెలిపారు.
|
|
Tuesday, 27 July 2010 15:24 |
|
2009 సంవత్సరంలో మొత్తం 140 బ్యాంకులు మూతపడ్డాయి.ఈ సంవత్సరం యిప్పటి వరకూ విఫలమైన అమెరికా బ్యాంకులు 'సెంచరీ' దాటాయి. దేశంలో 8,000 బ్యాంకుల డిపాజిట్లను బీమా చేసే ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డిఐసి) తెలిపిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటి వరకూ దాదాపు 103 బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. కేవలం ఈ జూలై నెలలోనే మూతపడ్డ బ్యాంకుల సంఖ్య 17కు చేరింది.ఆర్థిక పరిస్థితులు మందకొండిగా సాగుతుండటంతో బ్యాంకుల పరిస్థితి అనిశ్చితంగా మారింది.
కేవలం ఒక్క రోజున (జూలై 23న) ఏడు బ్యాంకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఎఫ్‌డిఐసికి దాదాపు 43.10 కోట్ల డాలర్ల మేర వ్యయం అయింది. మూతపడ్డ ఏడు బ్యాంకుల్లో సౌత్‌వెస్ట్ యుఎస్‌ఎ బ్యాంకు, హౌంవ్యాలీ బ్యాంకు, స్టెర్లింగ్ బ్యాంకు, విలియమ్స్‌బర్గ్ ఫస్ట్ నేషనల్ బ్యాంకు, థండర్ బ్యాంకు, క్రీసెంట్ బ్యాంకు, థ్రస్ట్ కంపెనీ కమ్యూనిటీ సెక్యూరిటీ బ్యాంకులు వున్నాయి. దీని ప్రభావం ప్రధానంగా చిన్న, మధ్యతరహా బ్యాంకులపైనే అధికంగా పడుతోంది. ఈ సంవత్సరంలో సగటున నెలకు దాదాపు 15 బ్యాంకులు మూసివేయబడుతున్నాయి. ఇదండీ అమెరికా ఆర్ధిక పరిస్థితి, మరి ఇదెప్పుడు మెరుగు పడుతుందో, మన దేశానికీ మరిన్ని పెట్టుబడులు ఎప్పుడు వస్తాయో!
|
|
Monday, 26 July 2010 09:20 |
|
ఆటో, టెక్, కన్జూమర్ డూరబుల్స్, మెటల్ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. అలాగే ఆసియా, అమెరికా, యూరప్ మార్కెట్లు లాభాల వైపు ర్యాలీని కొనసాగించడం బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణమైందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. ఆటో, టెక్, కన్జూమర్ డూరబుల్స్, మెటల్ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో శుక్రవారం 10.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి.
|
|
Sunday, 25 July 2010 13:24 |
|
జూన్,30 2010తో ముగిసిన త్రైమాసాలకు రూ.7236.40 కోట్ల ఆదాయంపైన రూ.1318.60 కోట్ల లాభాలను ఆర్జించగా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో అనగా జూన్,30 2009తో ముగిసిన త్రైమాసాలలో రూ.6246.20 కోట్ల ఆదాయంపైన రూ.1010.40 కోట్ల లాభాలను సాదించింది. ఈ త్రైమాసాలలో 4854 మందిని కొత్తగా తీసుకొన్నట్లుగాను, దీనితో సంస్థలో మొత్తం 1.12 లక్షల మంది పనిచేస్తున్నట్లుగా ప్రకటించారు. రెండవ త్రైమాసాలలో 1253-1277 మిలియన్ డాలర్ల ఆదాయం రావచ్చని ఆసిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఐటీ దిగ్గజాల్లో మూడవ స్థానంలో ఉన్న విప్రో కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసాలలో ఆదాయం 15.85 శాతం పెంచుకొని లాభాలను మాత్రం 30.5 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది.
|
|
|
|
|
|
|
Page 1 of 6 |