|
Saturday, 31 July 2010 09:14 |
|
ప్రభుత్వ రంగంలోని ఉక్కు ఉత్పత్తి కంపెనీ సెయిల్ స్టీల్ ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్మాణ, అటోమొబైల్ రంగాల నుంచి స్టీల్‌కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉక్కు ఉత్పత్తిలో సెయిల్ అతిపెద్ద కంపెనీ. దేశీయ మార్కెట్లో ఈ కంపెనీ వాటా 20 శాతంగా ఉంది. ఒక వేళ ఈ కంపెనీ స్టీల్ ధరలను పెంచితే మిగతా కంపెనీలైన జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎస్సార్ తదితర కంపెనీలు కూడా పెంచేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో జనవరి నెలలో టన్నుకు 615 డాలర్ల గరిష్ఠ స్థాయికి పెరిగిన హాట్ రోల్డ్ కాయిల్స్ ధర, జూలై నెలలో 550 డాలర్లకు పడిపోయింది. ఇందుకు కారణం యూరప్ దేశాలతో పాటు చైనాలో మాన్యుఫాక్చరింగ్ రంగంలో కార్యకలాపాలు మందగించడమే వర్మ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు హాట్ రోల్డ్ కాయిల్స్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది జూలైలో పలు స్టీల్ ఉత్పత్తుల ధరలు 4 శాతం తగ్గి 13 శాతానికి చేరాయని, అటు నిర్మాణ, ఇటు ఆటోమొబైల్ రంగాల నుంచి స్టీల్‌కు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల్లో స్టీల్ ధరలను సవరించే అవకాశం ఉన్నట్లు కంపెనీ అధికార వర్గాలు తెలిపాయి. స్టీల్ ధరలు పటిష్టపడుతున్నాయని, దీని వల్ల ధరలు పైకి పెరిగే విధంగా వత్తిడి ఉందని సెయిల్ చైర్మన్ సిఎస్ వర్మ తెలిపారు.
|