ప్రభుదేవాతో నాకు ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ప్రభుదేవా తనకు అన్నయ్యతో సమానమని బొద్దుగుమ్మ హన్సిక అంటోంది. హన్సికకు ప్రభుదేవాతో ఎఫైర్ ఉందని, అందుకే నయనతార-ప్రభుదేవాల బంధం చెడిందనితమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై హన్సిక స్పందిస్తూ... ఈ వార్తలను కొట్టి పారేసింది. ప్రభుదేవా-నయనతారల మధ్య విభేదాలు రావడానికి తాను కారణమనే వార్తలు విని షాకయ్యా... ప్రభుదేవా నాకు అన్నయ్య లాంటివాడు. మా ఇద్దరిపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధ పెట్టింది.
ప్రభుదేవా అన్నయ్య లాంటివాడు : హన్సిక
- Friday, 03 February 2012 12:15
సునీల్ కు బిరుదిచ్చిన 'పూలరంగడు' టీం
- Friday, 03 February 2012 12:02
హాస్య నటుడు నుంచి హీరోగా మారిన సునీల్ కు కొత్త బిరుదు చేర్చారు. ఆయన తాజా చిత్రం పూలరంగడులో సూపర్ రాజా సునీల్ అని వేస్తున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఈ బిరుదుతో ఉన్న పోస్టర్లను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రం పిబ్రవరి 18న విడుదల కానుంది. పూర్తి కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంపై సునీల్ కు చాలా అంచనాలు ఉన్నాయి.
నితిన్ కోసమే ఈ వేడుకకు వచ్చా : పవన్
- Friday, 03 February 2012 11:51
నితిన్ అంటే ఇష్టం, అతని కోసమే ఈ వేడుకకు వచ్చానని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తెలిపారు. గురువారం రాత్రి జరిగిన ‘ఇష్క్’ఆడియో వేడుకకు వచ్చి ఇలా స్పందించారు. పవన్ మాట్లాడుతూ 'ఒక ఆడియో వేడుక ద్వారా అభిమానుల్ని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సాధారణంగా బయట జరిగే వేడుకలకి వెళ్లాలంటే నేను ఆలోచిస్తా. నితిన్ అంటే నాకు ఇష్టం. అందుకే తనకోసమే ఈ వేడుకకు వచ్చాను. ఈ సినిమా విజయం సాధించి నితిన్‌కి మరింత మంచిపేరు తెచ్చిపెట్టాలి. అలాగే నాకెంతో ఇష్టమైన కెమెరామేన్ పి.సి.శ్రీరామ్.
ప్రారంభమైన సిద్దార్థ్-సమంతా చిత్రం
- Friday, 03 February 2012 11:44
సిద్దార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు గురువారం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొత్తగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఇంకా గోపీచంద్ మలినేని తదితరులు హాజరయ్యారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి గతంలో ‘అలా మొదలైంది’ సినిమాకు దర్శకత్వం వహించింది.
వైజయంతి బ్యానర్ లో రాంచరణ్, శ్రీనువైట్ల సినిమా
- Friday, 03 February 2012 11:41
శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ నటించబోతున్నారు. వైజయంతి బ్యానర్ పై ప్రముఖనిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ విషయమై అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ... 'రామ్‌చరణ్ 'చిరుత' చిత్రంతో మా సంస్థ నుంచే తెరంగేట్రం చేశారు. మరోసారి చరణ్‌తో సినిమా తెరకెక్కిస్తుండటం సంతోషంగా ఉంది. చరణ్ శైలిలోని మాస్ అంశాలతో పాటు, శ్రీనువైట్ల తరహా వినోదమంతా ఇందులో ఉండబోతోంది.
అభిషేక్ బచ్చన్‌కు 'గ్రీన్ గ్లోబ్' అవార్డు
- Friday, 03 February 2012 10:46
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు 'గ్రీన్ గ్లోబ్' ఆవార్డు లభించింది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్‌కే పచౌరీ చేతుల మీదుగా ఈ అవార్డును అభిషేక్ అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న సంస్థలతో తాను ఎల్లప్పుడూ పనిచేసేందుకు ఆసక్తిని చూపుతానన్నారు. బోర్డింగ్ స్కూల్‌లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తనకు నేర్పించారని.
రికార్డులు సృష్టిస్తున్న అమీర్ ఖాన్ 'తలాష్'
- Thursday, 02 February 2012 12:13
'త్రీ ఇడియట్స్' అమీర్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'తలాష్'. ఈ సినిమా విడదల కాకముందే రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేరిటికల్ రైట్స్ ని రిలయన్స్ సంస్థ 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు బాలీవుడ్ బాధ్షా షారూఖ్ ఖాన్ పేరిట ఉండేది. గతంలో షారూక్‌ఖాన్ ‘డాన్2’ చిత్రానికి ఇవే థియేరిటికల్ రైట్స్ క్రింద 80 కోట్లు లభించాయి.
ఆర్పీ పట్నాయక్ 'ఫేస్ బుక్'
- Thursday, 02 February 2012 12:01
సిద్ధు ఫ్రం శ్రీకాకుళం, సీతారాముల కల్యాణం లంకలో, సీమటపాకాయ్ వంటి హిట్ చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల మదిలో ఎనలేని ముద్ర వేసుకున్న వేల్పార్ క్రియేషన్స్ సంస్థ ఇప్పుడు తన నాల్గవ చిత్రంగా ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైన మంచి సందేశాత్మక చిత్రంగా 'ఫేస్ బుక్'ని నిర్మిస్తోంది. డా. ముళ్ళ విజయప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
జెన్నీ-రితేష్ సంగీత్ కు హాజరైన రాణా
- Thursday, 02 February 2012 11:50
జెనీలియా కోస్తార్ రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మంగళవారం వీరి సంగీత కార్యక్రమం ముంబై ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 3న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. సంగీత్ కార్య్రకమానికి బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ నుంచి హీరో దగ్గుబాటి రాణా కూడా హాజరయ్యాడు.
More Articles...
- 'రెబల్'గా వస్తున్న ప్రభాస్
- రవితేజకు ఒకే చెప్పిన నయనతార
- నిర్మాత, నటుడు పుండరీకాక్షయ్య మృతి
- 400 థియేటర్లలో మిస్టర్ నోకియా
- నితిన్ కి ఒకే చెప్పిన పవర్ స్టార్
- 'నెక్' మెంబర్ గా ఎన్నికయిన నిర్మాత గణేష్
- 18న వస్తున్న 'పూలరంగడు'
- ఫిబ్రవరి 3న 'నిప్పు' ప్లాటినమ్ డిస్క్
- జూన్ 13న రాంచరణ్ పెళ్లి
- సద్దుమనిగిన షారుఖ్, శిరీష్ ల వివాదం


