Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

మే 5న ఎన్టీఆర్ వివాహం

ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ వివాహ నిశ్చితార్దం వధువు లక్ష్మీ ప్రణతి ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సినీనటుడు బాలకృష్ణ, పురంధరేశ్వరి, కళ్యాణ్ రామ్, తారకరత్న మరియు ఇతర బందువులు హాజరయ్యారు. నిశ్చితార్దం అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ ఇది తన ఇంట్లో 5 సంవత్సరాల తరువాత జరుగుతున్న శుభకార్యమని మే 5న వివాహం జరపాలని నిశ్చయించామని, దీనిని ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు.

వివాహ వేదిక ఇంకా ఖరారు కాలేదని త్వరలో తెలియజేస్తామని హరికృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'శక్తి' మూవీ షూటింగ్ లో బిజీగా వున్నారు. పెళ్ళికి మాత్రం నెలరోజులు సెలవుపెట్టి పర్సనల్ విషయాలు చూసుకుంటానని ఎన్టీఆర్ అన్నారు. పెళ్లి వేడుకను అభిమానులందరూ చూసే విధంగా డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తారని సమాచారం.