Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

చెద పట్టిన శ్రీజ, బరద్వాజ్ ల ప్రేమ

movies telugu newsచిరంజీవి కూతురు శ్రీజ గుర్తుంది కదా? ఎందుకు ఉండదు అప్పటిలో ఆమెగారు చేసిన సీన్ చిన్నదేమీ కాదు కదా! శ్రీజ, శిరీష్ బరద్వాజ్... చాలా గొప్ప ప్రేమికులు. అందర్ని ఎదిరించి 2007 అక్టోబర్ న్యూ బోయిన్పల్లి ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి చేసుకున్న వీరి వివాహానికి అప్పటిలో చాలా మంది (బయటి పెద్దలు) సపోర్ట్ చేసారు. చేసేది లేక చిరంజీవి మౌనంగా ఉన్నారు. అది జరిగిపోయిన కధ!

కాని ఇప్పుడు  ఆ  ప్రేమకు  చెద పట్టింది. ఎలా అంటారా అప్పుడు "నువ్వే కావాలి" అన్న శిరీష్ ఇప్పుడు "నీ డబ్బేకావాలి" అంటున్నాడట. వివాహం అయిన ఎడాదికే తన భర్త ప్రేమ అసలి రూపం చూసి శ్రీజ భయపడింది. దీనికి తోడు అత్తగారి వేదింపులు తోడయ్యాయి. తను చేసింది తప్పు అని తెలుసుకున్న శ్రీజ ముందు జాగ్రత్తగా తన పేరు మీద ఉన్న ఆస్తులను పుట్టింటి వారి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసింది. అయితే పుట్టింటి నుండి 50 లక్షలు తీసుకురావాలని శిరీష్ వేదిస్తుండడంతో ఇంత కాలం ఓపిగ్గా భరించిన శ్రీజ ఇంక తట్టుకోలేక పోయింది.

సోమవారం సిసిఎస్ మహిళా పోలిస్ స్టేషన్ లో భర్త శిరీష్ పై, అత్తగారిపై ఫిర్యాదు చేసింది. పెళ్ళయిన దగ్గరినుండి శిరీష్ ఎలాంటి వ్యాపకం లేకుండా తిరుగుతున్నాడని అందుకే ఆస్తులను పుట్టింటి వారి పేరు మీద రీ-రిజిస్టర్ చేయించానని పోలీసులకు తెలిపింది. భర్త, అత్తల పై వరకట్న వేధింపులు, డౌరిప్రొహిబిషన్ యాక్ట్ ల కింద కేసు నమోదు చేసారు.