మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ నిశ్చితార్థం ఈ ఏడాదిలోపే జరగనుంది. ఈరోజు చరణ్ తండ్రి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే రాంచరణ్, ఉపాసనల నిశ్చితార్థం జరగనుందని తెలిపారు. ఇరు కుటుంబాలు కలిసి వారంలోగా నిశ్చితార్థానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాదు నగర మేయర్ కార్తీక చిరంజీవికి రాఖీ కట్టారు.
| < Prev | Next > |
|---|


