Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

'బిజినెస్మెన్-2' తీస్తా : పూరి

సంక్రాంతి పండగ సందర్భంగా మహేష్, పూరీ కాంబినేషన్లో వచ్చిన 'బిజినెస్మెన్' భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలుసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'బిజినెస్మెన్-2' తీయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు పూరి స్వయంగా చెప్పారు. 'బిజినెస్మెన్' ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు పూరి మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తాను. అందులోనూ మహేష్ బేబే హీరోగా ఉంటాడు.

ఈ సంవత్సరం చివరకల్లా ఈ చిత్రం ప్రారంభిస్తాను అన్నారు. ఇక 'బిజినెస్మెన్' కలెక్షన్స్ పరంగా పేరుకు తగ్గట్లుగా బిజినెస్ చేస్తోంది. నిర్మాత ఆర్ వెంకట్ కూడా తాము నిర్మించిన చిత్రాల్లో హైయిస్ట్ కలెక్టు చేసిన చిత్రం ఇదే కావటంతో చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. కాజల్, మహేష్ కాంబినేషన్ లో రూపొందిన 'బిజినెస్మెన్' చిత్రం రెండు వేల థియేటర్స్ లో సంక్రాంతి కానుకగా విడుదల చేసారు.