హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా, పట్టుదలగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఈగ'. నాని, సమంత, సుదీప్ ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు తెరపై ఇంతవరకు కనిపించని గ్రాఫిక్ వర్క్స్ తో ఓ విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ఆడియెన్స్ లోనూ స్పెషల్ ఇంటరెస్ట్ క్రియేటై వుంది.
ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా 'ఈగ' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ 'బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు ఎలా ప్రాణాలు కోల్పోయాడు అనే అంశం చూట్టు తిరిగే కథే 'ఈగ'. హీరో సినిమా మొదలైన అరగంటకే చనిపోతాడు. అయితే అతను ఈగ రూపాలో విలన్ పై ఎలా పగ సాధించాడు అనేది సస్పెన్స్. సంక్లిష్టమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ లు బాగా అర్థం చేసుకుని చక్కగా నటించారు. 'ఈగ'కు సంబందించిన గ్రాఫిక్స్ పనులు నడుస్తున్నాయి. షూటింగ్ పూర్తయ్యింది. వినోదం, టెన్షన్ కలిసిన చిత్రంగా ఇది ఉంటుంది. మూడు పాటలు ఉన్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణ. వచ్చే నెలలో ఆడియో విడుదల చేస్తామని రాజమౌళి తెలిపారు.