Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

19న 'మిస్టర్ నోకియా' ఆడియో

మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ నోకియా'. ఈ చిత్ర ఆడియోని ఈ నెల 19న విడుదల చేయనున్నారు. అని దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ సరసన 'తీన్ మార్' ఫేం కృతికర్బందా, సనాఖాన్ నాయికలుగా నటిస్తున్నారు. ఎంటర్ టైన్మెంటుకు హైవోల్టేజ్ యాక్షన్ ను జోడించి దర్శకుడు అని ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సందర్బంగా నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ '2012లో మా సంస్థనుండి రాబోతున్న సూపర్ హిట్ చిత్రం 'మిస్టర్ నోకియా'. మనోజ్ కెరీర్ లో ఇదొక ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ సినిమాలో అతని నటన, గెటప్, హావభావాలు సరికొత్తగా ఉంటాయి. ఈ సినిమా కోసం మనోజ్ ఎంతో రిస్క్ తీసుకున్నారు. మనోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంటర్ టైన్ మెంట్ వుంటుంద'ని చెప్పారు.