రమేష్‌బాబు, ప్రియాంక, పరమేష్, మోహన ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘టు-లెట్’. పోసాని కృష్ణమురళి ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. గెంటెం వేణుగోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ 'హారర్ చిత్రాల్లో ఇదొక వినూత్న ప్రయత్నం. కృష్ణమురళి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం' అని తెలిపారు.
| < Prev | Next > |
|---|


