Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

తెలుగు వారియర్స్ vs కేరళ స్ట్రైకర్స్‌

ఆస్ట్రేలియాలో భారత పరాజయాలను చూడలేక పోతున్న అభిమానులకు ఊరట. తారల క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాసేపు సంతోషంగా గడిపే అవకాశం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో విక్టరీ వెంకటేశ్ సారధ్యంలోని తెలుగు వారియర్స్ మూడో లీగ్ పోరుకు సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తో తెలుగు వారియర్స్ తలపడనుంది.

 

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను జెమిని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముంబై హీరోస్‌తో షార్జాలో జరిగిన వారియర్స్ తొలి మ్యాచ్ ‘టై’గా ముగియగా... హైదరాబాద్‌లో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో తెలుగు జట్టు నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక బుల్ డోజర్స్‌ను ఓడించింది. ప్రస్తుతం తెలుగు వారియర్స్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.