Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

రీమేక్ రాజా ఖాతాలో మరో సౌతిండియా సినిమా

బాలీవుడ్ రీమేక్ రాజా సల్మాన్ ఖాన్ మరో సౌతిండియా సినిమా రీమేక్ చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. తమిళంలో సూపర్ హిట్టైన 'వేట్టై' చిత్రాన్ని హిందీలో చేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం విడుదలకు ముందే  ఆయన యుటివీ ధనుంజయన్ ద్వారా చూసారు. తర్వాత తమిళంలో టాక్ కూడా బాగా రావటంతో సినిమాని హిందీకి చేయటానికి ఓకే అనేసారు. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను సల్మాన్ ఖాన్ చేస్తూండగా, ఆర్య చేసిన పాత్రను రణబీర్ చెయ్యనున్నాడు.

ఇద్దరు అన్నదమ్ములతో నడిచే యాక్షన్ చిత్రం ఇది. సంక్రాంతికి తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో మాత్రం అదరకొడుతోంది. ఇక ఇప్పటికే సల్మాన్ పోకిరీ, రెడీ, బాడీగార్డ్ చిత్రాలు హిందీలో చేసేసారు. త్వరలో రవితేజ కిక్ రీమేక్ చెయ్యనున్నారు.