Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

సద్దుమనిగిన షారుఖ్, శిరీష్ ల వివాదం

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, దర్శకుడు శిరీష్ కుందర్‌ల మధ్య వివాదం సద్దుమణిగింది. అగ్నిపథ్ విజయవంతమైన సందర్భంగా సంజయ్‌దత్ ముంబై నగర శివార్లలో ఏర్పాటు చేసిన నైట్ పార్టీలో కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్  భర్త శిరిష్‌పై షారుఖ్ దాడి చితకకొట్టిన సంగతి తెలిసిందే. వీరిమధ్య జరిగిన గొడవను బంద్రాలోని నివాసం మన్నత్‌లో షారుఖ్ను ఫరాఖాన్ సోదరుడు సాజిద్ ఖాన్, నిర్మాత సాజిద్ నడియావాలా, ఫరాఖాన్, శిరీష్ కలిసి వివాదాన్ని పరిష్కరించుకున్నారు.

తమ మధ్య జరిగిన వివాదంపై చింతిస్తున్నామని శిరీష్ అన్నారు. గత కొద్దికాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్న ఫరాఖాన్, షారుఖ్‌ల మధ్య స్నేహం కుదిరిందని శిరీష్ తెలిపారు. మేమంతా ఇపుడు స్నేహితలమయ్యామని ఆయన అన్నారు. సాజిద్ నడియావాలా, సాజిద్ ఖాన్‌లు కలిసి తమ మధ్య ఉన్న విభేదాల్ని తొలగించారని ఆయన అన్నారు. ఈ వివాదాన్ని ‘షేక్‌స్పియర్ ఫార్స్’ అని షారుఖ్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు.