చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ, తన మనవరాలు ఉపాసనల వివాహం జూన్ 13న జరుగుతుందని అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మంగళవారం టీ టీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులతో కలసి ప్రతాప్‌రెడ్డి దంపతులు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రాంచరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. చిరంజీవి తరఫున తిరుపతి, తమ తరఫున అరగొండలో రిసెప్షన్ నిర్వహిస్తామన్నారు.
| < Prev | Next > |
|---|


