Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ఫిబ్రవరి 3న 'నిప్పు' ప్లాటినమ్ డిస్క్

బొమ్మరిల్లు పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, దీక్షాసేథ్ జంటగా నటించిన 'నిప్పు' ఆడియో ఈ మధ్యనే విడుదలై విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఫిబ్రవరి 3న జరగనుంది. ఈ సందర్బంగా నిర్మాత వై.వి.యస్.చౌదరి మాట్లాడుతూ 'ఇటీవల ఆదిత్య మ్యూజిక ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్ హిట్ అయింది. తమన్ చాలా ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అన్ని ఏరియాల్లో ఆడియో సేల్స్ బాగుందని రిపోర్ట్స్ వస్తున్నాయి.

మా బొమ్మరిల్లు బేనర్ లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా చాలా పెద్ద హిట్ అయ్యాయి. దానికి మించిన రేంజ్ లో 'నిప్పు' ఆడియోకి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 3న ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ని జరపనున్నాం. రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం వుంది. ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.