నితిన్-నిత్యా మీనన్ జంటగా రూపొందుతున్న 'ఇష్క్' చిత్ర ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. సాధారణంగా ఫంక్షన్లు, కార్యక్రమాలకు దూరంగా ఉండే పవన్ ఈ ఫంక్షన్ కి రావడం విశేషం. ఫిబ్రవరి 2న జరిగే నితిన్ తాజా సినిమా ‘ఇష్క్’ ఆడియో వేడుకకు హాజరయ్యేందుకు పవన్ ఒప్పుకున్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.
చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఫంక్షన్ కు హాజరవుతుండటంతో ఇటు అభిమానుల్లోనూ ఆనందం నెలకొంది. నితిన్, నిత్య మీనన్ జంటగా రూపొందుతున్న ఇష్క్ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై, మల్టీ డైమండ్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.