Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

400 థియేటర్లలో మిస్టర్ నోకియా

మంచు మనోజ్, సనాఖాన్, కృతి కర్భందా నటించిన 'మిస్టర్ నోకియా' చిత్రాన్ని శివరాత్రి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ 'ఈ సినిమాలో మనోజ్ రిస్కీ ఫైట్స్ అవలీలగా చేశారు. క్లిష్టమైన డాన్స్ స్టెప్స్‌ని కూడా సునాయాసంగా చేశారు.

కథని నమ్మి చేసిన చిత్రం ఇది. యూత్‌ని టార్గెట్ చేసుకుని తీసిన ఈ సినిమాలో మంచి ఎనర్జీ ఉంది. ఈ చిత్రం మంచి విజయం  సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అన్నారు. నిర్మాత డీఎస్‌రావు మాట్లాడుతూ 'ప్రస్తుతం చెన్నయ్‌లో నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా మంచి పాటలిచ్చారు. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు నోకియా. అందుకే ఈ టైటిల్ పెట్టాం. మనోజ్ సమకూర్చిన ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని 400 థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. మనోజ్ సినిమాల్లో ఇంత భారీ స్థాయిలో విడుదలవుతున్న చిత్రం ఇదే'నని తెలిపారు.