జెనీలియా కోస్తార్ రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మంగళవారం వీరి సంగీత కార్యక్రమం ముంబై ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 3న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. సంగీత్ కార్య్రకమానికి బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ నుంచి హీరో దగ్గుబాటి రాణా కూడా హాజరయ్యాడు.
రాణా-జెనీలియా జంటగా నటించిన నా 'ఇష్టం' సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో జెనీలియా చేస్తున్నది ఈ సినిమానే కావడం గమనార్హం. పెళ్లి తర్వాత జెనీలియా హీరోయిన్‌గా నటించినా....ఇప్పటికే దక్షిణాది సినిమాలు దాదాపుగా దూరంగా ఉంటున్న ఆమె పెళ్లి తర్వాత ఇటు వైపు చూసే అవకాశాలు లేవంటున్నారు ఇక్కడి సినీ వర్గాలు. జెనీలియా ఈ సంవత్సరం హిందీలో ఇట్స్ మై లైఫ్, తెరే నాల్ లవ్ హోగయా, రాక్ ద షాది, బ్లడీ పాకి చిత్రాలకు కమిట్ అయింది. ఈ సినిమాల షూటింగులు ఇంకా పూర్తి కాలేదు. పెళ్లి పూర్తయిన తర్వాత కొన్ని రోజులు భర్తతో ఎంజయ్ చేసిన తర్వాత ఆయా సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉంది.