సిద్ధు ఫ్రం శ్రీకాకుళం, సీతారాముల కల్యాణం లంకలో, సీమటపాకాయ్ వంటి హిట్ చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల మదిలో ఎనలేని ముద్ర వేసుకున్న వేల్పార్ క్రియేషన్స్ సంస్థ ఇప్పుడు తన నాల్గవ చిత్రంగా ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైన మంచి సందేశాత్మక చిత్రంగా 'ఫేస్ బుక్'ని నిర్మిస్తోంది. డా. ముళ్ళ విజయప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
నిశ్చల, ఉదయ్, సూర్య, జెమిని సురేష్, అర్చనా శర్మ, నిశాశెట్టి, ప్రీతీ ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపుదిద్దుకుంటోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మా చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతి త్వరలో మిగితా కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు.
| < Prev | Next > |
|---|


