Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

రికార్డులు సృష్టిస్తున్న అమీర్ ఖాన్ 'తలాష్'

'త్రీ ఇడియట్స్' అమీర్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'తలాష్'. ఈ సినిమా విడదల కాకముందే రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేరిటికల్ రైట్స్ ని రిలయన్స్ సంస్థ 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు బాలీవుడ్ బాధ్షా షారూఖ్ ఖాన్ పేరిట ఉండేది. గతంలో షారూక్‌ఖాన్ ‘డాన్2’ చిత్రానికి ఇవే థియేరిటికల్ రైట్స్ క్రింద 80 కోట్లు లభించాయి.

ఇప్పుడు ఆ రికార్డుని చెరిపేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది 'తలాష్'. ఈ చిత్రంలో అమీర్ సరసన రాణీముఖర్జీ, కరీనా కపూర్ లు నటిస్తున్నారు. అమీర్ ఖాన్ 'త్రీ ఇడియట్స్' తరువాత సంవత్సరాల గ్యాప్ తీసుకుని నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.