శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ నటించబోతున్నారు. వైజయంతి బ్యానర్ పై ప్రముఖనిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ విషయమై అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ... 'రామ్‌చరణ్ 'చిరుత' చిత్రంతో మా సంస్థ నుంచే తెరంగేట్రం చేశారు. మరోసారి చరణ్‌తో సినిమా తెరకెక్కిస్తుండటం సంతోషంగా ఉంది. చరణ్ శైలిలోని మాస్ అంశాలతో పాటు, శ్రీనువైట్ల తరహా వినోదమంతా ఇందులో ఉండబోతోంది.
అలాగే మహేష్‌బాబు-క్రిష్ కలయికలో తెరకెక్కనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని' చెప్పారు. ఇక గతంలో ‘రాజకుమారుడు’తో మహేష్‌బాబును, ‘చిరుత’తో రామ్‌చరణ్‌ను హీరోలుగా పరిచయం చేసిన అశ్వనీదత్ ఒకే ఏడాది ఈ ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తుండడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ తాజా చిత్రం చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, శ్రీనువైట్ల శైలిలో సరదాగా సాగిపోయే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిసింది.