Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ప్రారంభమైన సిద్దార్థ్-సమంతా చిత్రం

సిద్దార్థ-సమంత జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు గురువారం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొత్తగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఇంకా గోపీచంద్ మలినేని తదితరులు హాజరయ్యారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి గతంలో ‘అలా మొదలైంది’ సినిమాకు దర్శకత్వం వహించింది.

ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నందినీరెడ్డి దర్శకత్వంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న సిద్దార్థ్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. సిద్దార్థ్ నటించిన మరో చిత్రం 'లవ్ ఫెయిల్యూర్' విడుదలకు సిద్దమైంది.