Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

నితిన్ కోసమే ఈ వేడుకకు వచ్చా : పవన్

నితిన్ అంటే ఇష్టం, అతని కోసమే ఈ వేడుకకు వచ్చానని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తెలిపారు. గురువారం రాత్రి జరిగిన ‘ఇష్క్’ఆడియో వేడుకకు వచ్చి ఇలా స్పందించారు. పవన్ మాట్లాడుతూ 'ఒక ఆడియో వేడుక ద్వారా అభిమానుల్ని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సాధారణంగా బయట జరిగే వేడుకలకి వెళ్లాలంటే నేను ఆలోచిస్తా. నితిన్ అంటే నాకు ఇష్టం. అందుకే తనకోసమే ఈ వేడుకకు వచ్చాను. ఈ సినిమా విజయం సాధించి నితిన్‌కి మరింత మంచిపేరు తెచ్చిపెట్టాలి. అలాగే నాకెంతో ఇష్టమైన కెమెరామేన్ పి.సి.శ్రీరామ్.

ఆయన ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అన్నారు. నితిన్, నిత్యామీనన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌కుమార్‌గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఇష్క్’. అనూప్‌రూబెన్స్, అరవింద్, శంకర్ స్వరాలను అందించిన ఈ చిత్రం పాటలను గురువారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించి తొలి ప్రతిని కరుణాకరన్‌కి అందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు దిల్‌రాజు, నందినీరెడ్డి, శిరీష్, లక్ష్మణ్, ఆర్.ఆర్.మూవీమేకర్స్ సురేష్‌రెడ్డి, గణేష్‌బాబు, సుధాకరరెడ్డి, అలంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.