Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

సునీల్ కు బిరుదిచ్చిన 'పూలరంగడు' టీం

హాస్య నటుడు నుంచి హీరోగా మారిన సునీల్ కు కొత్త బిరుదు చేర్చారు. ఆయన తాజా చిత్రం పూలరంగడులో సూపర్ రాజా సునీల్ అని వేస్తున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఈ బిరుదుతో ఉన్న పోస్టర్లను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రం పిబ్రవరి 18న విడుదల కానుంది. పూర్తి కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంపై సునీల్ కు చాలా అంచనాలు ఉన్నాయి.

సునీల్ సిక్స్ ప్యాక్ లో కనిపించిన ఈ సినిమా తన కెరీర్ ను పూర్తి స్థాయి హీరో రెంజుకు తీసుకేలుతుందని భావిస్తున్నాడు. అల్లరి నరేష్ తో 'అహనా పెళ్లంట' అనే చిత్రం తీసి హిట్ కొట్టిన వీరభద్ర చౌదరి ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం మళయాళ నటుడు దిలీప్ చేసిన 'పండిపడ' చిత్రం ఆధారంగా రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. యూనిట్ మొత్తం ఈ చిత్రం విజయంపై కాన్ఫిడెంట్ గా ఎదురుచూస్తున్నారు. 'బిజినెస్ మ్యాన్' నిర్మించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సునీల్ కెరీర్ లోనే ఎక్కువ ప్రింట్స్ తో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.